ASR: పాడేరులో ధర్నాలు, సమావేశాలకు నిర్దేశిత స్థలం ఏర్పాటు చేస్తూ కలెక్టర్ నిశాంతి జారీ చేసిన ఉత్తర్వులను గిరిజన సంఘం ఖండించింది. ఐటీడీఏ ముందు ధర్నాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించడం ఆదివాసీల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని గిరిజనసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్, అధ్యక్షుడు ధర్మన్న పడాల్ అన్నారు. కలెక్టర్ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి'


