హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

ప్రకాశం: బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో రూ.51 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హెల్త్ సెంటర్‌తో పాటు రూ.15 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.