హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్ట్ హెల్త్ కార్డుల పునరుద్ధరణ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో సోమవారం (05-10-2026) పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు TUWJ జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య తెలిపారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు చెందిన జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డుల ద్వారా తమ నిరసనను తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.