హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

SRPT: దసరా, బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ సూచించారు. పండుగల సందర్భంగా ప్రజలు, యువత, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయకుండా, తక్కువ శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లను వినియోగించాలని సూచించారు.