కోనసీమ: రాజోలు మండలం పొన్నమండ సమీపంలోని మెరకపాలెంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎలుమర్తి బాబూరావు పొలంలో ఒకే అరటి చెట్టు మొదలు నుంచి ఏకంగా ఏడు అరటి గెలలు తొడిగాయి. సాధారణంగా అరటి చెట్టుకు ఒకే గెల వస్తుండగా, ఒకే మొదలు నుంచి ఏడు గెలలు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆశ్చర్యం.. ఒకే అరటి చెట్టుకు 7 గెలలు


