హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నకరికల్లులో బాదం విత్తనాల సేకరణ

PLD: నకరికల్లు మండల బీజేపీ అధ్యక్షులు మున్వర్ బాజీ నేతృత్వంలో ‘స్వచ్ఛత సే సేవ’ ప్రోగ్రామ్ జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాదం విత్తనాలను సేకరించారు. బాదం చెట్లు దట్టమైన నీడను, చల్లదనాన్ని ఇస్తాయని, వీటి ఆకులు, పండ్లు పక్షులకు, మనుషులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.