హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

AKP: మునగపాక జడ్పీ స్కూల్ 1979- 80 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం తిమ్మరాజుపేటలో జరిగింది. 48 మంది మిత్రులు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రిటైరైన సహచరులు ఎన్. శంకర్రావు, సత్యనారాయణ, జగన్నాథరావులను సన్మానించారు. 1992 నుంచి ఏటా అక్టోబరు మొదటి ఆదివారం ఈ సమ్మేళనం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు పెంటకోట రాము తెలిపారు.