హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైల్వే భూ సేకరణ వేగవంతం చేయాలి'

కోనసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి–నర్సాపూర్ రైల్వే లైన్‌కు ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేయడంపై కోనసీమ రైల్వే సాధన సమితి (KRSS) హర్షం వ్యక్తం చేసింది. అమలాపురంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైల్వే లైన్ పనుల పురోగతిపై సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని ప్రతినిధులు కోరారు.