హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమ ముఖద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

కోనసీమ: పల్లె పండుగ 3.0లో భాగంగా రావులపాలెంలో రూ.2.83 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రావులపాలెం కోనసీమ ముఖద్వారాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.