హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు: ఆప్కాబ్ ఛైర్మన్

ELR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు స్పష్టం చేశారు. ఆదివారం భీమడోలులో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం ఆగదని, హైకోర్టు తీర్పును గౌరవిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ గిరి, పెద్దిరాజు పాల్గొన్నారు.