E.G: పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులో 205 మంది లబ్ధిదారులకు రూ.1.02 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలను పంపిణీ చేశారు. గత రెండేళ్లలో నియోజకవర్గంలో 1,382 మందికి రూ.9.07 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా ప్రభుత్వం మారుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 1.02 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం: మంత్రి


