హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకి రైతులకు రాయితీపై శనగ విత్తనాలు

BPT: అద్దంకి మండలంలో శనగ సాగు చేసే రైతులకు ప్రభుత్వం 35 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. రైతులు సమీప రైతు భరోసా కేంద్రాల్లో (RBK) తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాలకు సరిపడా విత్తనాలను అందజేస్తామని, ఈ నెల 15వ తేదీ నుంచి ఈ పంపిణీ చేస్తామన్నారు.