HYD: తెలంగాణ భవన్‌లో బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశంలో మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు తగిన పారితోషికం, ఉద్యోగ భద్రత, గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: వినోద్ కుమార్


