హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేచర్లపేటలో పోలీసుల కార్డాన్‌ అండ్‌ సెర్చ్

కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో కాకినాడ టూ టౌన్ పరిధిలోని రేచర్లపేటలో పోలీసులు కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. పోర్ట్ సీఐ పి. సునీల్ ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 మోటార్‌ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.