ATP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-తిరువణ్ణామలై (వయా గుత్తి) ఏడు ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరువణ్ణామలై రైలు (07003) ఈనెల 6 నుంచి నవంబర్ 11 వరకు మంగళవారాల్లో నడుస్తుందన్నారు. తిరుగు ప్రయాణపు రైలు (07004) ఈనెల 7 నుంచి నవంబర్ 18 వరకు బుధవారాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి మీదుగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు


