హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేధింపుల కేసు నమోదు: సీఐ నారాయణరెడ్డి

ATP: తాడిపత్రి మండలం కొనగుంటపల్లికి చెందిన కీర్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డిపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. 2017లో వివాహమైన తర్వాత అదనపు కట్నం కోసం మద్యం సేవించి, దాడి చేస్తుండటంతో కీర్తి పుట్టింటికి వచ్చిందని పేర్కొన్నారు. ఫోన్‌లోనూ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారని తెలిపారు.