హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు ఈ-కేవైసీ కోసం స్పెషల్ డ్రైవ్

ATP: ఈ-పంట నమోదు పూర్తి చేసిన రైతులకు ఈ-కేవైసీ చేయించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జేడీఏ సాలురెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో 18,36,233 ఎకరాల్లో నమోదు చేయాల్సి ఉండగా 16,45,527 ఎకరాల్లో (90%) పూర్తయిందన్నారు. ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు ఈ-కేవైసీపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు సెల్ ఫోన్‌లోనూ ఈ-కేవైసీ చేసుకోవచ్చన్నారు.