హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలాజీ నగర్‌లో దసరా మహోత్సవాలకు సన్నాహాలు

NLR: ఉదయగిరిలోని బాలాజీ నగర్‌లో శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారి దసరా మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.