NLR: కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పంతగిరి కృపావతి అదృశ్యమైనట్లు కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. బాలికకు సంబంధించి సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే కొడవలూరు పోలీసులను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురుకులంలో విద్యార్థిని అదృశ్యం


