కోనసీమ: రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం 283 మండలాలను తీవ్ర కరువు, 105 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా మాత్రమే ప్రకటించి రైతులకు అన్యాయం చేస్తోందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో సాగు చేసిన పంటల్లో సగానికి పైగా ఎండిపోయాయని తెలిపారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతులను ఆదుకోవడంలో చర్యలు చేపట్టాలి: కామన


