హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు యథావిధిగా PGRS: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేయవచ్చన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.