హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య సేవే పవిత్రమైన బాధ్యత: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన ISECON-2026 వైద్య సదస్సుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి కేవలం ఉద్యోగం కాదని, మానవ ప్రాణాలను కాపాడే పవిత్ర బాధ్యత అని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్యులకు సూచించారు.