కోనసీమ: మలికిపురం మండలం బట్టెలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన నల్లి శాంతి కిరణ్, అమలాదాసు దివ్యలను రాజోలు నియోజకవర్గం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ అసోసియేషన్ సభ్యులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ విజేతలకు సత్కారం


