హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్పూర్ తాలూక సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వేణుగోపాల్

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో నియోజకవర్గ పరిధిలోని సర్పంచుల సమావేశం ఆదివారం నిర్వహించారు. బారెగూడ సర్పంచ్ కోట వేణుగోపాల్‌ని సిర్పూర్ తాలూక సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచులందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి కోసం, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని వేణుగోపాల్ పేర్కొన్నారు.