హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం(M) వడ్లరామాపురం మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు పి.ధర్మారెడ్డి ఆకస్మిక మృతిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదివారం సంతాపం తెలిపారు. వడ్లరామాపురంలోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ధర్మారెడ్డి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటుని పేర్కొన్నారు.