VZM: తెర్లాం శాఖ గ్రంథాలయంలో ‘ఆదివారం చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పద్యాలు, గద్యాల పోటీలు నిర్వహించారు. పంచతంత్ర, సరదా, నవరత్నాలు, పొడుపు కథలు, కుందేలు కథలు చదివించి, చెప్పించారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే లక్ష్యమని గ్రంథాలయ అధికారి సీహెచ్. కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తెర్లాంలో ‘ఆదివారం చదవడం మాకిష్టం’


