హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి జూడోలో మెరిసిన విద్యార్థులు

విజయనగరం: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14,17,19 విభాగములో జూడో పోటీలు రామభద్రపురం మండలం ఆరికతోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణం స్కూల్ నుంచి 14 మంది హాజరవ్వగా 6 గురు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారని విద్యార్థుల కోచ్ రామకృష్ణ ఆదివారం తెలిపారు.