హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ని ఢీకొట్టి కంటైనర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తుతో లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.