W.G: భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని తొమ్మిది మద్యం దుకాణాల దరఖాస్తు గడువును అక్టోబర్ 6 రాత్రి 11:59 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ CI బసంతి తెలిపారు. మున్సిపాలిటీలో ఆరు, రూరల్ పరిధిలో మూడు షాపులు ఉన్నాయి. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత పొందినవారికి అక్టోబర్ 8న కలెక్టరేట్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు


