హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'​ఆటకెక్కిన శానిటేషన్.. పెరిగిన ధరలు'

PLD: 'గుడ్ మార్నింగ్ నరసరావుపేట'లో భాగంగా 13వ వార్డులో ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ శానిటేషన్ అస్తవ్యస్తమైందని, డీఎస్పీ, జడ్జీల నివాసాల వద్దే లైట్లు లేక గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని మండిపడ్డారు. కేజీ బియ్యం రూ.80కి చేరి పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు.