హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగీతం శ్రీనివాసరావుకు VSFMA నివాళి

VSP: భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ (VSFMA) ఆదివారం నివాళులర్పించింది. మూకీల నుంచి టాకీ యుగం వరకు ప్రయోగాత్మక చిత్రాలతో సింగీతం చరిత్ర సృష్టించారని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వై.అప్పారావు పేర్కొన్నారు. ఆయన సినిమాలు నేటి తరం సినీ రూపకర్తలకు దిశానిర్దేశమన్నారు.