హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైపాస్ రోడ్డు పనుల పురోగతిపై మంత్రి ఆరా

NDL: బనగానపల్లె పట్టణంలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆంజనేయస్వామి వీధిలో డ్రైనేజీ పనులు, యాగంటి పల్లె రోడ్డులో బైపాస్ పనులను మంత్రి పరిశీలించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.