చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలు ఉన్నవారు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లోను అర్జీలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'చిత్తూరులో రేపు పీజీఆర్ఎస్'


