ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని పోతంగి పంచాయతీ టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పోటీకి సంబంధించిన వివరాలతో కూడిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి. సుబ్బారావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై టీడీపీ నేతల సమావేశం


