హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెల్‌ఫోన్‌ చోరీ.. యూపీఐ ద్వారా డబ్బులు కాజేసిన వ్యక్తి అరెస్ట్

కడప రైల్వే పోలీస్‌ స్టేషన్‌ క్రైం నంబర్‌ 46/2026లో సామ్సన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితుడి సెల్‌ఫోన్‌ చోరీ చేసి, అందులోని యూపీఐ ద్వారా రూ.1,07,103 నగదు బదిలీ చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, నగదు ఉన్న ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు.