హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్ట రామకృష్ణ తండ్రి మృతికి సుజాతమ్మ సంతాపం

NDL: ప్యాపిలి మండలం వెంగళంపల్లి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు పుట్ట రామకృష్ణ తండ్రి మృతికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదివారం సంతాపం తెలిపారు. ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.