KKD: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు విశాఖకు చెందిన జి. పద్మావతి ఆదివారం రూ. 1,00,116 విరాళం ఇచ్చారు. తన భర్త దివంగత జి. జగన్నాధరావు పేరిట ఏటా మే 8న అన్నదానం జరపాలని కోరారు. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దాతకు స్వామివారి దర్శనం చేయించి, పండితుల ఆశీర్వచనాలు, పథకం బాండ్, చిత్రపటం, శేష వస్త్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కుటేశ్వర స్వామి అన్నదానానికి రూ. లక్ష విరాళం


