NTR: నందిగామ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 'హెల్దీ ఇండియా.. హ్యాపీ ఇండియా' కార్యక్రమంలో భాగంగా కంటి, బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తుల పరీక్షలు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో ఉచిత ఆరోగ్య శిబిరం


