హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓటుకు నోటు కేసులో నా వాదనలూ వినండి'

ఓటుకు నోటు కేసులో తన వాదనలు కూడా వినాలని ఫిర్యాదుదారు స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టులో ఐఏ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కౌంటర్లకు అనుమతి లేదని, కోర్టుకు సహకరించవచ్చని తెలిపిన సుప్రీంకోర్టు.. స్టీఫెన్‌సన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ విచారణను పది రోజులకు వాయిదా వేసింది.