హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం నాయకుడు గృహనిర్బంధం..!

AKP: రాంబిల్లి మండలంలో లారస్ ఫార్మా భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వెళ్లకుండా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. అప్పలరాజును ఆదివారం ఎస్. రాయవరం పోలీసులు ధర్మవరం అగ్రహారంలో గృహ నిర్బంధం చేశారు. పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, రైతులకు న్యాయం చేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు.