హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధికారుల తీరుపై కరణం ధర్మశ్రీ ఆగ్రహం

AKP: భూసేకరణ సమయంలో రాంబిల్లి మండలం గొరపూడిలో గుండెపోటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ వెళ్లారు. అంత్యక్రియల కోసం టెంట్ వేసేందుకు కూడా పోలీసులు, అధికారులు నిరాకరించడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడం సమంజసమేనా అని సూటిగా నిలదీశారు.