హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుగొండలో బీజేపీ సమావేశం

KRNL: కోడుమూరు మండలం అనుగొండలో ఇవాళ బీజేపీ మండల విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు బోయ వీరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.