హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో శరన్నవరాత్రి వేడుకలకు సన్నాహాలు

W.G: ఆకివీడు ఆనాల చెరువు గట్టు వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో 25వ శరన్నవరాత్రి మహోత్సవాలకు పందిరిరాట వేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.