హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

BHNG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం రోజున భక్తులతో పోటెత్తింది. సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకున్నారు. సాధారణ దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.