MHBD: జిల్లా గంగారం మండలంలో పలు రహదారులు గుంతలమయమై వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గంగారం నుంచి కొత్తగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారితో పాటు కామారం రహదారి పలుచోట్ల దెబ్బతింది. మూడు సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించి, కంకర పోసి వదిలేశారు.దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మరమ్మతులకు నోచుకోని రహదారులు


