హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ గర్భగుడి నిర్మాణానికి భారీ విరాళం

MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయంలో గర్భగుడి నిర్మాణానికి భారీ విరాళం అందింది. గ్రామానికి చెందిన శ్రీధర్ రాజు - మహిజ దంపతులు రూ.10 లక్షలను ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. గ్రామానికి తనవంతు సాయం చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, అది ఇప్పుడు ఇలా నెరవేరినట్లు శ్రీధర్‌రాజు తెలిపారు.