హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయి నగర్ కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

MBNR: జడ్చర్ల పురపాలక పరిధిలోని సాయి నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ST పాల్స్ స్కూల్ మెయిన్ రోడ్డులోని డ్రైనేజీలు పిచ్చి మొక్కలు, గుర్రపుడెక్కతో కూరుకుపోవడంతో మురికినీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని  కోరుతున్నారు.