హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ రెడ్ క్రాస్ ఎన్నికలకు 33 నామినేషన్లు

NLG: నల్గొండలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ 2026-29 పాలకవర్గ ఎన్నికలకు 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది సభ్యులను ఎన్నుకోనుండగా.. గోలి అమరేందర్‌రెడ్డి ప్యానెల్ నుంచి 16 మంది, ఇతరులు 17 మంది నామినేషన్లు వేశారు. రెడ్‌క్రాస్ చరిత్రలో ఇదే అత్యధికమని తెలిపారు. సోమవారం నామినేషన్ల పరిశీలన, మంగళవారం ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి మమత తెలిపారు.