GDWL: ఇటిక్యాలలోని లింగమ్మ చెరువుకట్టపై శుక్రవారం ఎంపీడీవో రమాదేవి ఈత మొక్కలు నాటారు. చెరువుకట్ట కోతకు గురికాకుండా మొక్కలను సంరక్షించి పెంచడం అందరి బాధ్యత అని ఆమె అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కమతం రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
చెరువుకట్ట రక్షణకు మొక్కలు నాటిన ఎంపీడీవో


