WNP: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడైన గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా ఫారం-18 దరఖాస్తును అధికారులకు అందజేసి ఓటరుగా నమోదు చేసుకున్నారు.
తెలంగాణ
ఫారం-18 అందజేసిన వనపర్తి కలెక్టర్


